అమ్మ ఆదిపరాశక్తి. - నాన్నగారు పరమశివుడు.

అమ్మ సకల వేదసారం. - నాన్నగారు  సకల కళా వల్లభుడు.

అమ్మ అవ్యాజానురాగమూర్తి.- నాన్నగారు ఆపేక్షకు  నిలువెత్తురూపం.

అమ్మ స్థితప్రజ్ఞ. - నాన్నగారు నిత్య సంతోషి.

 

అమ్మ నాన్నగారు మనకు ఆదిదంపతులు. అమ్మ నాన్నగారి గురించి ఎప్పుడు ప్రస్తావించిన 'తన దైవం' అనే చెప్పేది.

 

అట్లాగే ఆచరించింది. అట్లాగే ఆరాధించింది. మరొక సందర్భంలో అమ్మ నాన్నగారిని 'గొడుగు' గా అభివర్ణిచింది. ఇంకో సందర్భంలో 'వారి కాలిగోటిలొని మట్టియే తనకు సర్వసంపదలు, సకల సౌభాగ్యాలూ' అని మురిసిపోయి అందరిని విస్మితులను చేసింది.

 

'నాన్న గారి సౌకర్యము, నాన్నగారి ఆనందమే ధేయంగా, లక్ష్యంగా అమ్మ భావించినట్లు అమ్మ జీవిత చరిత్ర పరిశీలిస్తే మనకు అవగతం అవుతుంది' అని అంటారు. అమ్మ చరిత్ర 'జీవిత మహోదధిలో తరంగాలు' కర్త శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య.

 

ఒకనాడు నాన్నగారు  ప్రసంగవసాన 'మీ అమ్మగారి భావ బలం ఎక్కువ' అన్నారు. అది భావబలం కాదు.. బావబలం. అని  అమ్మ చమత్కరించింది.

 

మరి నాన్నగారు? అయన 'అమ్మను ఎలా దర్సించారు? అమ్మతో అనుభవాలు ఏమిటి? ఈ కోణం లో విషయసేకరణ జరిగితే కడురమ్యంగా ఉంటుంది. అదీ ఈ శతజయంతి సంవత్సరము అయితే మరింత  అర్థవంతం.

 

అందరికీ  జిల్లేళ్ళమూడి ప్రవేశం అమ్మకొసం. అయితే మా 'కొండముది' కుటుంబానికి ప్రత్యేకం. మా జిల్లేళ్ళమూడి  ప్రవేశం నాన్నగారు శ్రీ  బ్రహ్మాండం నాగేశ్వరరావుగారి ద్వారా దాదాపు 8 దశాబ్దాల  క్రితం 'నానగారి' తో మా తాతగారు శ్రీ కొండముది వెంకట సుబ్బారావుగారికి సోదర బంధుత్వముతో బాటు విడదీయరాని స్నేహం ఉండేది. ఆ స్నేహం, భాంధవ్యంతోనే  అమ్మ-నాన్నగార్ల కళ్యాణం లో మా తాతగారు ప్రముఖపాత్ర నిర్వహించారు. ఆ విధి నిర్వహణలో నాన్నగారికి మా తాతగారు చేదోడువాదుడుగా ఉండేవారు. అందుకోసం తరుచుగా   జిల్లేళ్ళమూడి వచ్చేవారు. అన్నయ్యకు నాన్నగారికి మధ్య  ఉన్న 'అనుబంధం' ఈ లౌకిక బంధాలతో పోల్చలేనిది. 'ఒరేయ్ రామకృష్ణుడు' అని నాన్నగారు పిల్చేపిలుపు రామకృష్ణ అన్నయ్యకు ఎప్పుడూ కర్త్యవ్యం ఉపదేసించేది. అలాంటి సంఘటన ఎది. అమ్మ-మాట నాన్నగారి నోట.

 

ఒకరోజు  రామకృష్ణ అన్నయ్య అమ్మ గది ముందు ఎంతో ఆదుర్దాగా తిరుగుతున్నాడు. అప్పుడే అక్కడికి  వచ్చిన 'నాన్నగారు' అన్నయ్య అవస్ట చూసి 'ఏమిటి రామకృష్ణుడు అలా ఉన్నావు? అని ఆరా తీసారు'. ఏమిలేదు బాబాయి, సంస్థ అభివృద్దిని దృష్టిలో పెట్టుకొని కొంతమంది పెద్దవారిని జిల్లేళ్ళమూడి ఆహ్వానించి  ఉన్నాను. ఎన్నో ప్రయత్నాల తరువాత వారు ఇవాళ వచ్చారు. కాని దురదృష్టం వలన ఇవాళ 'అమ్మ'కు బాగా అనారోగ్యం ఉన్నది. 'దర్శనం'  ఇప్పించటానికి వీలులేని పరిస్థితి. అందుకే ఆందోళనగా ఉన్నాను. అని అన్నయ్య జవాబిచ్చాడు.    

 

అన్నయ్య ఆదుర్దా చూసి నాన్నగారు గుంభనగా నవ్వి 'మీ అమ్మ గారి సంగతి నన్ను అడగరా చెబుతాను. వాళ్ళు వచ్చిన విషయం మీ అమ్మ గారికి చెప్పు. అవసరం అయితే ఎంత బాధనైన చొక్కాను చిలకకోయ్యకు తగిలించినట్లు తగిలించి బాధ తీసుకోనగలదు. ఇది నేను ఎన్నోసార్లు గమనించాను' అని సలహా  ఇచ్చారు.

 

నాన్నగారి సలహా విని, తు చా తప్పకుండా ఆచరించాడు అన్నయ్య. అమ్మ  వెంటనే లేచి స్నానం చేసి తయారై 'దర్శనం' కు రెడీ అయింది ఇప్పుడు అన్నయ్యకు మరో ధర్మ సందేహం పీడించింది 'అమ్మకు' ఆరోగ్యం బాగా లేదని ఆ పెద్దమనుష్యులకు చెప్పి ఉన్నాను. కాని ఇప్పుడు 'అమ్మ' లో ఆ ఛాయలు కనిపించటము లేదు. నా మాట అబద్ధం అని వాళ్ళు అపార్థం చేసుకొంటారు. అని, అమ్మ అలౌకిక శక్తులను అనేకం నాన్నగారు స్వయంగా దర్శించారు. అమ్మ పొందిన యోగా పరాకాష్ఠ స్థితులైన భ్రుకటీ ఖేదనం, కపాల ఖేదనం నాన్నగారు చూసారంట. ఒకనాడు అమ్మ నాన్నగారికి అన్నం వడ్డిస్తుండగా  భ్రుకటీ ఖేదనం జరిగి రక్తం స్రవించిందట. ఆ రక్తం నాన్నగారి విస్తట్లో పడకుండా అమ్మ చేయి పట్టినదట. చేతిలోని రక్తం భస్మంగా మారినదట.

 

ఆ భస్మాన్ని అమ్మ నాన్నగారికి పెట్టిందట. నాన్నగారు దాన్ని తిన్నారట. ఈ విశేషం నాన్నగారు అనేక పర్యాయాలు అతి సంభ్రమాశ్చ్ర్యములతో చెప్పేవారు.

 

అమ్మ నాన్నగారియందు కూడా వాత్సల్యా మృతాన్ని అభివర్ణించిన సర్వజనయత్రి అందుకే 'భర్త చేత కూడా 'అమ్మ' అని పిలిపించుకోవడమే ప్రాతివత్యానికి పరాకాష్ట్ట'. అన్నది అమ్మ. సాధించి చూపించింది కూడా.

 

ఒక కళ్యాణదినోత్సవం నాడు 'దేవాలయం' పై భాగాన నాన్నగారు అమ్మ చరణాబ్జాలపై సభిక్తకంగా పువ్వులుంచిన అపూర్వమదుర సన్నివేశం ఎంతమందినో పులకాంకితులను చేసింది. అమ్మ శివప్రియయే కాదు నాన్నగారు శివారాధ్య కూడా.

Author: 
కొండముది సుబ్బారావు