1. వారు నన్ను వదిలి పెడతానన్నా నేను వారిని వదలి పెట్టను.
2. 24-10-1963 న మొహం కడుక్కుని నీళ్ళు తెమ్మని - ఆ నీళ్ళతో మంగళ సూత్రాలనభిషేకించి కళ్ళకద్దుకొని మూడు సార్లు త్రాగారు. " ఆ తీర్థమే నాన్నా! నన్ను పావనం చేసేది . ఈ తీర్థంతో నేను పావనమైతే మీకు తీర్థం వెయ్యటానికైనా అర్హత కలుగుతుంది, మిమ్మల్ని పావనం చెయ్యలకపోయినా!"
3. అమ్మ ముందుగా నాన్నగారికి ఉగాది పచ్చడి పెట్టి వారి పాదాలకు నమస్కరించి మందిరంలోకి వచ్చారు.
4. అమ్మ ఈ నాడు తానై నాన్నగారికి అన్నీ చేస్తూండకపోవచ్చు, కాని, వారు అన్నం తిన్నారో-లేదో, ఏం కావాలో ... అని అహర్నిశలూ కనుక్కోవటమూ ఆలోచించటమూ --- ఇవి చేసేదాని కంటే ఎక్కువేగా?
5. భర్త అంటే శరీరం కాదు భావన
6. ఇంజెక్షన్లు చెయ్యమంటావా ? ఎన్ని? - డా. సాంబయ్య "వారెట్లా చెపితే అట్లా, ఎన్ని చెయ్యమంటారో అన్నీ- వారిష్టం"
7. 1-7-65న గజేంద్రమ్మ పాలుతేగానే - అమ్మకు కాఫీ కలిపిస్తే - "ముందు నాన్నగారికిచ్చిరా-" అన్నారు.
8. 'ఇదిగో శుభలేఖమ్మా!..' "ఇది నాన్నగారు చించి చదివిన తర్వాత నేను చదవటం న్యాయం."
9. పొత్తూరి వేంకటేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి -తెల్ల ద్రాక్ష పండ్ల గుత్తి తెచ్చిస్తే - " దీన్నీ నాన్నగారికిచ్చిరండి." అన్నారు.
10. బుద్దిమంతుడన్నయ్య దినపత్రిక తీసుకొస్తే అది తీసుకొని : "ముందు నాన్నగారి కివ్వండి -" అన్నారు.
11. కొత్త టేప్ రికార్డర్ తెచ్చి మొదట ఏది రికార్డు చేయ్యమంటావమ్మ' అంటే "నాన్నగారు పద్యాలు చదువుతారేమో కనుక్కోండి.."
12. "నాన్నగారు మొక్క జొన్న కండె చూసి ... "ఏం,తినమంటావా?" –అని అడిగారు
"మీ ఇష్టం.."
13. ఇది (జందెం) స్నానం చేసివేసుకోవాలంటారుగా, వేసుకోమంటావా?....
"మీ ఇష్టం.."
14. 'గయలో పిండం వదిలేస్తే తద్దినాలు పెట్టనక్కరలేదుట గదా! అట్లా చెయ్యమంటావా?' అని నాన్న గారు, “ నాకేం తెలుస్తుంది?" 'దాన్ని గురించి నీకేం భావం లేదా?' "ఏ భావం లేకుండా ఎట్లా ఉంటుంది? ఏదో భావం ఉంటుంది."
15. నాన్నగారు "నువ్వుకూడా రోజూ రెండు ఫర్లాంగులు నడవరాదు?" అంటే డాబా మీద రోజూ నడిచేవారు
16. 'అది (నల్ల కుక్క పిల్ల) మీ అమ్మ గారి పెంపుడు కుక్కండి!' అని నాన్నగారంటే "మీకు కూడా..”
17. 'అప్పుడు మీ అమ్మగారు పిలక బాగుండలేదన్నదిరా! అందుకనే తీసేశాను.’ –నాన్నగారు…. “నేననలేదు.” 'అన్నదిరా....... నువ్వు గట్టిగా నేననలేదు అను..' "నేనెందుకంటాను" నే ననను..నేనన్నానని మీరంటుంటే కాదని నేనెట్లా అంటాను.? అనను" ……. 'నువ్వన్నావు'….. "సరే!"
18. అయితే ఇప్పుడు నువ్వు నాతో కంకర్ అవుతున్నట్లేగా?' "ఒకప్పుడు కాకపోతేగా?"
19. నాన్నగారు మందిరంలో పడుకొని మూల్గుతున్నారు. అమ్మ నాన్నగారి దగ్గర కెళ్ళి చూసి కాళ్ళు పితుకుతూ ... మందు వేయలన్నారు.
20. నాన్నగారికి కొబ్బరినూనేతో డొక్క మీద పావు గంట రుద్దారు. వాటర్ బాటిల్ తో కాపు చేసి వెళ్ళారు.
21. నాన్నగారికి టెంపరేచరు ఎక్కువైంది. నాన్నాగారి మంచం దగ్గర కింద పక్క వేయుంచుకున్నారు.- అమ్మ –అయితే రాత్రంతా కూర్చొనే వున్నారు సేవ చేస్తూ..
22. 'వక్క పలుకున్నదా' అని నాన్నగారు అడిగితే అమ్మయే లేచి వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చారు.
23. గోపాలకృష్ణమూర్తి గారు వెళ్ళిపోతుంటే "నాన్నగారితో చెప్పారేమో కనుక్కోండి".... అన్నారు.
24. నాన్నగారి పేరు చెప్పవలెనని అమ్మను ఆడపిల్లలు అడ్డగిస్తే - "చెప్పేదేముంది?- అది ఎప్పుడూ వున్నది. ఆ స్మరణ ఎప్పుడూ ఉన్నది ... అన్ని నామాలూ ఆ నామం అనుకుంటే ఆ నామంలోవేగా ఇవన్నీ? 'నా' సరే 'గే' అన్నప్పుడు దేహం కూడా వున్నది. 'నా' దేహం అయినప్పుడు ఇంకా పేరు చెప్పటమేముంది?"
25. 'మేనమామ కూతురూ ఒక భార్యే?' అని ఒకరు, అట్లాగాదు అనేది మేనత్త కొడుకు ఒక మొగుడేనా? అని ఇంకొకరు,... " మొగుడని ఎవరనుకుంటున్నారు? దేవుడనుకున్నానుగా!
26. ఆమెకింకా పాతివ్రత్య మేమిటంటారు. పాతివ్రత్యమంటే పతిని ఆధారం చేసుకుని పంచభూతలనూ జయించటం"
27. మనం తొక్కి విడిచి వెళ్ళినా, మన పాదాల కోసం ఎదురు చూస్తాయి పాదరక్షలు