నేను 'అంఆ' ను అంటూ '' ఆడ్డు లేనిదీ , 'అం' అంతులేనిది'అం ఆ' అన్నింటికీ అందరికి ఆధారమైనది అని తనగురించి అమ్మ విడమరచి చెప్పింది.

 

ఆ అమ్మే  మనకు  తన  తారక నామాన్ని   " జయహో   మాతా,      శ్రీ అనసూయ,     రాజరాజేశ్వరి    శ్రీ పరాత్పరి "    అనే  రూపంలో ఇచ్చిపోయింది.

 

ఈ  నామంలోనే  సృష్టి , స్తితి   లయలు  ఉన్నవి.    ఈ మూడు   ఆ పరబ్రహ్మలో నుంచి  వచ్చినవే అని ఆ పరబ్రహ్మ    తాను  అని    చెప్పక    చెప్పింది.

 

లలితా  సహస్ర   నామావళి లో      " సృష్టి కర్ర్తీ బ్రహ్మ రూపా"     "గోప్ర్ర్తీ గోవింద రూపిణి "      " సంహారిణి రుద్రరుపా"     "తిరోధానకరీస్వరి"     అని    చెప్పారు.

 

ఆ నాలుగూ   అమ్మ నామంలో   ఉన్నవి’   వాటిని   సరిగ్గా   అర్ధం చేసుకుంటే.

 

"అమ్మలగన్నయమ్మ   ముగ్గురమ్మల మూలవుటమ్మ"  అని  కూడా  అన్నారు.   అంటే   బ్రహ్మలోని   సృష్టి శక్తీ  విష్ణువులోని రక్షణ  శక్తీ     రుద్రుడులోని    లయ శక్తీ    ఈ మూడు ఆ మూలటమ్మలోనివే .   ఆ పరబ్రహ్మ తత్వములోనివే. ఈమూడు   శక్తులకు    మూడు గుణాలకు   అతీతంగా   ఉండేదే   ఆ పరాశక్తీ.   అదే పరబ్రహ్మ తత్వము   .పరాత్పరి అయిన   మన   అమ్మతత్వము.

 

ఈ  నాలుగు   ఏకం  చేస్తే

 

"జయహో మాతా !       శ్రీ అనసూయ !!      రాజరాజేశ్వరి !!!      శ్రీ పరాత్పరి!!!!"        అవుతుంది.

 

అదే  మన అమ్మ నామం.   ముగ్గురమ్మల నామం.   ఆ పరబ్రహ్మ నామం. లలితలోని మొదటి నాలుగు నామాలు

 

శ్రీ మాతా ,  శ్రీమహారాజ్ఞి,    శ్రీమత్ సింహాసనేస్వరి    చిదగ్నికుండ సంభూత

 

జయహో మాతా  :   మాత   అంటే   తల్లి.     అదే  తొలి.        ఆ  తోలే   సృష్టి శక్తి .     అందుకే అమ్మ తనను గురించి చెబుతూ "నేను అమ్మగా నిర్ణయించుకొని  వచ్చాను."  అని  అంటుంది.  లలితా   సహస్రనామాలలోని    మొదటి నామం   శ్రీమాతా.  ఆ మాతకే   జయము.   ఆ మాతే   శ్రీ   అనసూయగా   కనవచ్చింది.   

 

శ్రీ అనసూయ :   ఇక్కడ  అమ్మ  పేరుకు   ముందు  ' శ్రీ'   చేర్చబడింది. శ్రీ - బీజాక్షరం . వేదాలలో శ్రీ సూక్తం  అని ఒకటి ఉంది. ఈ శ్రీ లో మూడు అక్షరములు  ఉన్నవి. శకారము   రకారము   ఈకారము.  ఈ మూడు కలిపి శ్రీ అగును. శకారము ఆనంద వాచకము. రకారము (తేజో) జ్ఞాన వాచకము. ఈ అనేది పరబ్రహ్మం యెక్క శక్తి.    ఈ మూడు త్రిగుణాత్మకమైన  ప్రకృతిని సూచిస్తాయి.  ఈ చక్రములోని  త్రికోణములుగా  భావిస్తారు. బిందువు అమ్మ యొక్క శివశక్త్యాత్మక మైన పరబ్రహ్మ స్వరూపము  . అన్నీతానై టువంటిది అసూయ   లేనటువంటిది. అదే  'అనసూయ'.  అసూయా అందరిలోనూ ఉంటుంది  కాస్తో కూస్తో.  తనకు మించిన వారి మీద.  అంటే రెండుగా చూస్తన్నవారికి ఉంటుంది. అమ్మకు రెండు లేవు. ఈ కనబడేదంతా నేనే. నాదే నేనుకానిదంటూ నాది కానిదంటూ ఈ సృష్టిలో ఏమి లేదు. 'అంతా నేనే అంతా నాదే' అని నొక్కి చెప్పింది. అంతా తానే అయినప్పుడు అంతా తనదే అయినప్పుడు తన దృష్టిలో రెండుగా ఏది లేన్నప్పుడు ఎవరి మీద  అసూయ ఉంటుంది. అందుకే అమ్మలో విష్ణుతత్వము ఉంది. అంటే సర్వ వ్యాపకత్వం.  అదే అమృతత్వము. అందుకే  ఇక్కడ శ్రీ అనసూయగా  సంభోదించబడింది.

 

రాజరాజేశ్వరి :   ఇది  ఈశ్వరి తత్వము.  లయ తత్వము.. ఈ మంచములో ఇంకా ఎన్నాళ్ళు? అన్న మా నాయన్నమ్మను ఆర్తిగా  నా చేత అడిగించుకొని అమ్మ తక్షణమే తనలో కలుపుకుంది. ఇలా ఎన్నో!

 

శ్రీ పరాత్పరి :   పై మూడుంటికి అతీతంగా ఉంది. ఆ పైన వుండే ముగ్గురమ్మల మూలటవుమ్మా అయిన అ మూల తత్వమే  పరబ్రహ్మ తత్వము. అదే  పరాత్పరి తత్వము. మన అమ్మ తత్వము

రాజమ్మగారు అమ్మ కు ఉపదేశము చేయటానికి సన్నధమై

 

గురుర్ బ్రహ్మ ...........  అని మొదలు పెట్టగానే అమ్మ తను సమాధి స్తితికి వెళ్లి ఆమెను తెచ్చి కొంతసేపు దానిలో ఓలడానించి  బయటికి తెస్తే తెలుసుకోలేక ఏదో మాయ కప్పినట్లు  అయినదమ్మ అని అంటుంది. రాజమ్మగారికి అమ్మ చేసిన పనే 'అమ్మనామం' మనల్ని ఆ స్తితికి తీసుకెళ్ళుతుంది.

గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర

గురు  సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః

అమ్మ మనకు గురువు దైవమ్. ఆ గురువు ఆ దైవం యొక్క ఏకమైన తారక నామమే ఆ పరాత్పరి నామం పరబ్రహ్మ స్వరూపము.

అమ్మ నామము

పై శ్లోకములోని భావాలే "జయహో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి " లోను ఉన్నవి. సత్వ రజ   స్థమో గుణములు. సృష్టి  స్తితి లయలు  ఆ పరబ్రహ్మలో నుండి వచ్చినవే. ఈ శక్తులు గుణాలు తత్వములు మనలోనూ ఉన్నవి. అవి తెలుసుకొంటే బ్రహ్మ గ్రంధి మూలాధారములో, విష్ణు గ్రంధి మణి పూరకములో, రుద్రగ్రంది ఆజ్ఞాచక్రములో వున్నవి. ఆపైన సహస్రారంలో ఉండే బిందువు. శ్రీచక్రంలో చెప్పే బిందువు ఆ పై ఛేదించబడి మనలో ఉన్న కుండలినీ శక్తీ సహస్రారానికి చేరితే మానమూ పరబ్రహ స్వరూపమే అని తెలుసుకుంటాం. అది మనకు తెలియ పరచడానికే   అమ్మ   మనకు

జయహోమాత                            బ్రహ్మగ్రంధి                    మూలాధారము

శ్రీ అనసూయ                             విష్ణుగ్రంధి                     మణిపూరకము

రాజరాజేశ్వరి                              రుద్రగ్రంధి                     ఆజ్ఞా

శ్రీపరాత్పరి                                 సహాస్రారము                బ్రహ్మకపాలము

ఇచ్చింది.

 

కుండలినీశక్తీ సుషుఘ్నానాడి గుండా పై మూడు గ్రంధులను చేధించుకుంటూ సహస్రారం చేరి ఆ తేజస్సును చూడగలిగేతే సమాధి    స్థితిపొంది ఆనందంలో గడుపుతాము. మనం చేయాల్సిందల్లా ఆ నామం మీద మనసు పెట్టి మననం చేయడమే.  ఆ పైన నామమే మనల్ని ముందుకు నడిపించి ఆధ్యాత్మిక  ఆనందాన్ని అందిస్తుంది.

 

ఒక సోదరుడు అమ్మతో మోరపెట్టుకున్నాడు. నీ వద్దకు వచ్చినందుకు మాకు ఏమి ఇచ్చావు? మాలో ఏ మార్పుకలగటం లేదు. అని. అమ్మ జాలిగా 'అదేమిటరా అట్లా అంటావు మీకు నా నామాన్ని ఇచ్చానుగా. మీకు అంతకన్నా ఏమి కావాలిరా? అంది.

 

అందుకేనేమో సర్వకాల సర్వావస్థలయందు  వీలైనప్పుడు అమ్మ నామాన్ని మనసులో మననం చేసుకుంటూ ఉండేవాణ్ణి.   పనిచేసుకుంటూ కూడా అమ్మ నామాన్ని గుర్తు చేసుకుంటూ వుండేవాడిని.     క్లిష్టమైన పనికాని,  స్టేట్మెంట్ టాలి కాకాపోయినప్పుడు కాని  నా దగ్గరకు వచ్చి సలహా కోరే వారు అమ్మ నామస్మరణ వలన వారికి సరైన సలహా ఇవ్వడములో  గాని స్టేట్మెంట్ ఎక్కడ తప్పు ఉన్నదో స్పురించి చెప్పడం గాని జరిగేది. అందుకోనేమో 'నామి కన్నా నామము గొప్పది'. అని పురాణాలూ ఘోషించుచున్నాయి.  ఎందరో మహానుభావులు నామముతో తరించినారు. రామ నామము వల్లనే ఆంజేనేయ స్వామితో కూడా శ్రీరాముడు యుధము చేయలేకపోయాడని మహాత్ములు కొందరు పల్కుతున్నారు.

 

నేను రోజూ సాయంత్రము వేళ వాకింగ్ చేయునప్పుడు కూడా అమ్మ నామాన్ని మననము చేసుకుంటూ నదిచేవాడిని.ఒకసారి  గుంటూరు బ్రాడిపేట 4వ లైనులో రోడ్డువారిగా నడుస్తుండగా అడుపుదీవి శ్రీ రామమూర్తి (అప్పుడు గుంటూరులో ఉద్యోగం చేస్తూండేవాడు)  రిక్షాలో నన్ను దాటిపోతూ అమ్మ నామం తన చెవిలో పడి రిక్షా ఆపి నా దగ్గరకు వచ్చి పలకరించాడు. అమ్మ నామం వినబడి చూస్తే నీవు వస్తున్నావు అందుకే ఆగాను అన్నాడు. నాకు ఆశ్చర్యము వేసింది. నేను అమ్మ నామాన్ని మనసులో మననం చేసుకుంటూ వుంటే ఎవరికీ వినబడనిది  ఈయనకు ఎట్లా వినబడినదీ అని.  ఎప్పుడు యిట్లా నామము చేసుకుంటూ నడుస్తావా? అని అడిగాడు.  'అవును'   ఆన్నాను.  అయినా మనసులో చేసుకుంటూ వస్తూవుంటే నీకు ఎలా వినబడింది? అని అడగడం నా వంతు అయింది. తనకు పెద్దగానే వినబడింది అన్నాడు. అదే అమ్మనామం గొప్పతనము. మనస్సులో ఉన్న నామము యొక్క తరంగాలు ఎవరికి వినబడకుండా తనకు మాత్రమే వినబడడం అంటే అమ్మ నాకు అనుభవం ఇవ్వటానికే. నీవు చేసే నామము నేను వింటున్నానని అమ్మ నాకు తెలియపరచటానికే అని నాకు అర్థమైంది.    అందరు అవతార మూర్తుల్లాగానే అమ్మ తన శరీరాన్ని వదలిపోయినా తన నామాన్ని మనకు ఇచ్చి అందరిచేతా చేయించి  హైమను కారణం చేసి 1968లో అఖండ నామాన్ని ప్రవేశపెట్టింది. ఈ అమ్మ నామము ఆలయాల కన్నా సంధ్యావందన, సుప్రభాతం కన్నా ముందే ఆవిర్భవించింది . అంటే షుమారు 1960/1961 లో గుంటూరులో కుమారస్వామి ఇంట్లో ఈ నామముతో ఆరోజు ఏకాహం జరిపించుకున్నది.

 

నామం కోసమే అమ్మ ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యం గారిని వారి కుటుంబాంన్ని జీతం ఏర్పాటు చేసి  జిల్లేళ్ళ మూడికి రప్పించింది. అలాగే మరికొందరిని జీతం ఇచ్చయిన ఏర్పాటు చేసి అఖండ నామాన్ని అఖండంగా జరిగేటట్లు చూస్తే మనకు సరైన మనుగడ లేదా మనం వచ్చింది దేనికోసమో అర్థం కాలేదని అనిపిస్తుంది. మనల్ని కడతేర్చేది నామం.

 

కానీ, అమ్మ ఏర్పరిచిన ఆధ్యాత్మిక  కార్యక్రమము కొరకు కాకపోతే జిల్లేళ్ళమూడికి వచ్చే జనానికి పనేమిటి? జిల్లేళ్ళమూడికి  వచ్చే భక్తులకు ఏవో ఆధ్యాత్మిక తరంగాలు వారి చెవులలో పడుతూ వుంటే వారికీ మానసిక ఆనందం,  తృప్తి  కలగ చేసినవారము అవుతాము. లేదా అక్షర జ్ఞానం మాత్రమే ఇవ్వగలిగన కళాశాల విద్య. ఆ విద్యార్థులను పోషించే హాస్టల్ గా మాత్రమే సంస్థను చేసినవారము అవుతాము.

Author: 
రాచర్ల లక్ష్మీనారాయణ