"అమ్మ" యను రెండు బీజాక్షరమ్ము లందు

 

వేయి ‘పంచాక్షరు’లు పల్లవించు -నూరు

 

వేల ‘అష్టాక్షరు’ లు మొగ్గవిడుచు -వేయి

 

వేల ‘తారకములు’ పూచివెల్లి విరియు

 

పలుకులు రావు నీ పరమ వత్సల భావము గూర్చి వర్ణనల్

 

సలుపుదమన్న --మా ప్రతిభ సర్వము నీ పదపీఠిచెంత ఏ

 

కలగనొ ఏదో చిన్న అలగానో కడుంగడు అల్పమైన య

 

ట్టులుగనొ తోచు మేమిక నెటుల్ రచియింతము తల్ల్లీ! నీ కథల్

 

ఏదో వచించలేని ఒక హృద్గత తేజము మూర్తివంతమై

 

కదలెడు అక్షియుగ్మమున కాంతిశారీరిణి! శాంతి సారిణీ,

 

ఇది భవదీయ దివ్య కరుణేక్షణ- మీ క్షణ మీ కృపాబ్దిలో

 

ఎదకదలంగ నీదని - రహించు పిపాసను తీర్చుకోగనీి

 

జిల్లెళ్ళమూడి ఆశ్రితుల సేవలు గైకొనుచున్ ప్రశాంతి సం

 

దిల్లగ జేయ లోకమున దివ్య శుభాకృతి దాల్చి నీవు రం

 

జిల్లుచు నుండ, రూప గుణ చేష్టలు, లింగం లేకయే- విరా

 

జిల్లును బ్రహ్మమంచును వచించె దరేటికొ! పండితోత్తముల్

 

ఆమె ఆహ్లాదమయియు దయార్ర్ధ హృదయ

 

ఆమె తావగు నిత్యకళ్యాణ సేవ

 

మరచి పోలేరు జన్మజన్మములకైన

 

కలువ కన్నుల వెన్నెల కన్నతల్లి

 

కామితార్థం లొసగెడు కల్పవల్లి

 

భక్తిజన చాతకాంబుద భాగ్యవల్లి

 

ముక్తిదాయిని జిల్లెళ్ళమూడి తల్లి

 

అమ్మ! దయాకదంబ! పరసాంతర భావ రసావలంబ, మా ి

 

యమ్మ! జిల్లెళ్ళమూడి యెకదమ్మ కదంబవనమ్ము, నేడు మా

 

యమ్మల గన్నయమ్మ కనులారగ గాంచెడు భాగ్యమబ్బెలే

 

వమ్మ! కృపం కనుంగొనగదమ్మ! మదంబ! కరావలంబవై!

Author: 
డాక్టర్
Source: 
MotherofAll