తల్లి అంటే తొలి
అమ్మ అంటే సంపూర్ణ అవతారం కాదు, సంపూర్ణత్వం
ఎవడి అన్నం వాడి కుంటే వాడు తింటున్నాడు, ఎవరుకి ఎవరో పెట్టేదేముంది.
అసలైన అమ్మకు ఎవరిని చూచినా బిడ్డ అనే అనిపిస్తుంది.
భర్త అంటే శరీరమే కాదు భావన కూడ.
సుఖం అంటే ఎవరిష్ట ప్రకారం వాళ్ళకు జరగటమే.
ఒకనాటి మాట మరొక నాటికి బాట అవుతుంది.
తెలుసుకున్నది తెలివి ---అనుభవించేది అనుభవం
సవరణ అవసరం లేనిది వివరణ
నాలుగు వేదములు: పొయ్యి, చీపురు, రోలు-రోకలి, కత్తిపీట .
పంచమ వేదం : చేట.
త్రిగుణములు: ఉప్పు, కారము, పులుపు
మానవుని నడక నవగ్రహాల మీద ఆధారపడి లేదు. రాగద్వేషాలనే రెండే గ్రహాల మీద ఆధార పడి ఉంది. ఆ రెండిటికి ఆధారం 'నేను'
భరించలేనిదే బాధ
సహించలేనిదే హింస
ఇష్టం లేనిదే కష్టం.
అవసరమే విలువైనది.
గణనకు క్కూడా అందనిది గండం
వర్గం లేనిది స్వర్గం
ముముక్షుత్వమే మోక్షం
వైఫల్యం లేనిదే కైవల్యం
తృప్తే ముక్తి
తనను తాను విమర్శించుకోవటం వివేకం, ఇతరులను విమర్శించటం అవివేకం.
ప్రేమించటమూ- ద్వేషించటమూ తన కొరకే.
నవ్వుతూ అనుభవించేవాడి దగ్గరకు --ఏడుస్తూ అనుభవించే వాడు సలహా కు వస్తాడు
సంఘటనల కూర్పే జీవితం.
ఆశా- అసంతృప్తుల కలయికే జీవితం
అనుకున్నది చేతలలో కనబడుతుంది. అన్నది కనబడదు.
అందరికీ సరిపోయేదే సూక్తి.
ఒక బాధ తగ్గవలేనంటే మరొకటి రావాలి.
రెండు వస్తువులు కలిస్తే గాని మరొక వస్తువు గుణం బైటికి రాదు.
శిల్పానికి అందం రావాలంటే ఉలిదెబ్బలవసరం.
మహావాక్యాలు అనుభవం లేకపోతే మన వాక్యాలే.
సాహిత్యముతో రాహిత్యం రాదు.
కడ తేర్చేవి మాటలు కావు.
అధైర్యమే ధైర్యానికి ఆధారం
చీకటే వెల్తురు కాధారం
ఇతరులతో తగాదా ఆడటం- పోరాటమూ, తనతో తాను పోరాడటమే- ఆరాటమును.
మానవుడే తర్కం.
నోటితో చెప్పుకుంటే బాధ కానీ, అనుభవించటం తేలికే
చెయ్యలేనిదే హింస- ధర్మం అనేది ఎవరో చెప్పింది.
పెద్ద వాళ్ళు చిన్న ఆలోచనలు చేస్తే , చిన్నవాళ్ళు పెద్ద ఆలోచనలు చెస్తారు.
తనను కన్న వాళ్ళ మీద కంటే, తాను కన్నవాళ్ళ మీద ప్రేమ ఎక్కువ.
ప్రేమ అనేది ఉంటే నువ్వేది చేసిన ఇష్టమే.
చేస్తున్నా పోట్లాడేది కుమారుడు, పోట్లాడుతున్నా చేసేది తల్లి.
భారం వహించే శక్తి ఎక్కడ ఉన్నదో- అక్కడే మాతృత్వం.
పంచటములో హెచ్చు తగ్గు లుండవచ్చు. కానీ, పెట్టటం సమానమే.
తనకు తానూ మెప్పించుకున్నప్పుడే ప్రపంచాన్ని మెప్పిస్తున్నాను అనుకుంటాడు.
. నచ్చకపోవటమే తప్పు
అనుకున్నది తన కోసం అనుకుంటాడు, అన్నది ఇతరుల కోసం అంటాడు.
చిక్కించుకునే చిక్కం అల్లేవాడి దగ్గరుంటుంది.